
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కోరిన ఒంగోలు ఎంపీ మాగుంట
ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలును ఢిల్లీలోని సైనిక్ స్కూలు సొసైటీతో అనుసంధానించాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ణు కలిసి వినతిపత్రం అందించారు. తమ నెక్స్ట్ జెన్ఇంటర్నేషనల్ స్కూలును సైనిక్ స్కూలు సొసైటీలో అనుసంధానం చేయడానికి కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయని స్కూల్ చైర్మన్ డాక్టర్ కె.మురళీధర్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు రాజ్ నాధ్ సింగ్ ను కలిసి మాగుంట వివరాలు అందించారు. రక్షణ శాఖ ఆద్వర్యంలోని సైనిక్ స్కూలు సొసైటీలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం క్రింద (PPP) స్కూలును 2026-27 సంవత్సరానికి సైనిక్ స్కూలు సొసైటీలో అనుసంధానం చేయాలని కోరారు. దీనిపై రాజ్ నాధ్ సింగ్ సానుకూలంగా స్పందించి పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.




