
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు నియమితులయ్యారు. బాపట్ల కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనను ప్రకాశంకు బదిలీ చేశారు. ప్రకాశం కలెక్టర్ గా పనిచేస్తున్న తమీమ్ అన్సారియాను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. వీరితో పాటు మొత్తం 12 మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన జిల్లా కలెక్టర్లు..
1. పార్వతీపురంమన్యం – ప్రభాకర్ రెడ్డి
2. విజయనగరం – రామసుందర్ రెడ్డి.
3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
4. గుంటూరు – తమీమ్ అన్సారియా
5. పల్నాడు – కృతిక శుక్లా
6. బాపట్ల – వినోద్ కుమార్
7. ప్రకాశం – రాజా బాబు
8. నెల్లూరు – హిమాన్షు శుక్లా
9. అన్నమయ్య – నిషాంత్ కుమార్
10. కర్నూలు – డాక్టర్ ఎ సిరి
11. అనంతపురం – ఓ.ఆనంద్.
12. సత్య సాయి – శ్యాంప్రసాద్





