రేపటి నుంచి రెండు రోజులు పాటు మార్కాపురంలో శిక్షణ
విజయవాడ, ఆగష్టు 29 : ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరులకు ఈనెల 30, 31న రెండు రోజుల పాటు మార్కాపురంలో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నట్టు సి. ఆర్. మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ విలేకరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మార్కాపురంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ ఈనెల 30 ఉదయం 10 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయి.. సభానంతరం శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.. తొలి రోజున క్రైమ్ రిపోర్టింగ్, గ్రామీణ వార్తలు, కధనాలు, ఫ్యాక్ట్ చెక్ అనే అంశాలపైనా, మరుసటి రోజు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI), పత్రికా భాష, ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్ లో మెళకువలు, నెట్వర్క్ అండ్ కోఆర్డినేషన్ అనే అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆలపాటి వెల్లడించారు.





