గిరిజన సంక్షేమంలో నూతన అధ్యాయం

పాడేరులో రేపు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, ఆగస్టు 08: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గిరిజన ప్రాంతాల్లో నూతన అధ్యాయం ఆరంభమైంది. ఏజెన్సీ జిల్లాల్లోని ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోంది. గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాడేరులో జరుగనున్న కార్యక్రమానికి హాజరు కానున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ- కృత్రిమ మేధస్సు, ఆదివాసీల భవిష్యత్తు అనే థీమ్ తో ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ గిరిజన దినోత్సవ నిర్వహణకు పిలుపునిచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జిల్లా పాడేరులో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పాడేరు మండలం వంజంగి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. తొలుత మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం స్థానిక గిరిజన సంప్రదాయ వేడుకలకు హాజరు అవుతారు. ఆదివాసీల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలను ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకోనున్నారు. అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో సీఎం మాట్లాడనున్నారు. ఆ తర్వాత లగిసపల్లె వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం అక్కడి నుంచే శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై సీఎం సమక్షంలో ఎంఓయూలను కుదుర్చుకోనున్నారు. అనంతరం కొద్దిసేపు పార్టీ శ్రేణులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు.

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు

మారుమూల గిరిజన ప్రాంతాలు, ఆవాసాలను ఏజెన్సీలోని ప్రధాన కేంద్రాలు, ఇతర మైదాన ప్రాంతాలతో అనుసంధానించేలా ప్రభుత్వం రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో వేగం పెంచింది. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మాణంతో పాటు ఆదివాసీల ప్రాంతాలు, నివాసాలకు కనెక్టివిటీ కోసం రూ. 2404 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే ఐదేళ్లలో 2075కు పైగా గిరిజన గ్రామాలకు, నివాసాలను రోడ్లు, వంతెనలతో అనుసంధానించాలని నిర్ణయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రోడ్ల కారిడార్లను రూ.41 కోట్లతో చేపట్టనుంది. ఐటీడీఏ చింతూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 నుంచి 100 పడకల ఆస్పత్రికిగా మార్చడంతో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాల కోసం రూ.50 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరలోనే నిర్మాణాలు పూర్తై ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే జల్ జీవన్ మిషన్ కింద గిరిజన ప్రాంతాల్లోని 13,816 ఆవాసాలకు మంచినీటి సరఫరా కోసం రూ. 2,373 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టింది. 2026 నాటికి ఈ పనులు పూర్తి చేసి ఆదివాసీలు అందరికీ తాగునీరు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

  • Related Posts

    • APNEWS
    • September 5, 2025
    • 28 views
    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    శని, ఆది వారాల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపించండి సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలి కొత్త కేసులు నమోదు కాకూడదు – అందరిలో నమ్మకాన్ని పెంచండి వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర…

    • APNEWS
    • September 5, 2025
    • 44 views
    బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు

    * హర్షం వ్యక్తం చేసిన మంత్రి సవిత * బీసీలపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం ఈ అవార్డు అమరావతి : బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించింది. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధతమయ్యే నిరుద్యోగ బీసీ యువతకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు.

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…