జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆమె పెద్దకుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్ని సీఎం పరిశీలించారు. 1వ తరగతి చదవుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్‌కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ సీఎంకు తెలిపారు. అనంతరం అలివేలమ్మ చిన్నకుమారుడు, ఆటోడ్రైవర్ జగదీష్‌తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించిన ముఖ్యమంత్రి వారి కుటుంబ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.






