రాష్ట్రానికి రానున్న కొత్త రహదారుల ప్రాజెక్టులు
రాష్ట్ర పర్యటనలో భారీ ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ
• హైదరాబాద్ – విజయవాడ రోడ్డు 6 లైన్లు చేస్తారు. ఖర్చు రూ.6700 కోట్లు
• విజయవాడ – మచిలీపట్నం రోడ్డు 6 లైన్లు చేస్తారు. ఖర్చు రూ.2600 కోట్లు
• వినుకొండ- గుంటూరు రోడ్డు 4 లైన్లు చేస్తారు. ఖర్చు రూ.2605 కోట్లు
• గుంటూరు -నిజాంపట్నం రోడ్డు 4 లైన్లు చేస్తారు. ఖర్చు రూ.2000 కోట్లు
• బుగ్గకయిప – గిద్దలూరు రోడ్డు 4 లైన్లు చేస్తారు. ఖర్చు రూ.4,200 కోట్లు
• ఆకివీడు- దిగమర్రు రోడ్డు 4 లైన్లు చేస్తారు. రూ.2500 కోట్లు
• పెడన – లక్ష్మీపురం రోడ్డు 4 లైన్లు చేస్తారు. ఖర్చు రూ.4,200 కోట్లు
• ముద్దునూరు -కడప రోడ్డు 4 లైన్లు చేస్తారు. ఖర్చు రూ.1182 కోట్లు
• ఇవి కాకుండా హైదరాబాద్ -విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా మంజూరు చేశారు.
• ఏడాదిలో మరో లక్ష కోట్ల రూపాయాల హైవే ప్రాజెక్టుల మంజూరుకు వేదిక నుంచే గడ్కరీ అంగీకారం తెలిపారు. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు…గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఉదయం అన్నదాత సుఖీభవతో సంక్షేమ కార్యక్రమం…సాయంత్రం సంపద సృష్టించే అభివృద్ది కార్యక్రమంలో భాగస్వామి అవ్వడం మరిచిపోలేని అనుభవం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.




