సింగపూర్ చేరుకున్న చంద్రబాబు నాయుడు

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు

సంప్రదాయ నృత్యాలతో సీఎంను స్వాగతించిన చిన్నారులు, మహిళలు

సింగపూర్, జూలై 27: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు. సింగపూర్ కు చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాను బసచేసే హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన వారు స్వాగతం పలికారు. సీఎంకు స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చారు.. హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ లు హాజరు కానున్నారు.

చంద్రబాబుకు సాదర స్వాగతం పలుకుతున్న సింగపూర్ లోని తెలుగు ప్రజలు

  • Related Posts

    • APNEWS
    • September 5, 2025
    • 28 views
    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    శని, ఆది వారాల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపించండి సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలి కొత్త కేసులు నమోదు కాకూడదు – అందరిలో నమ్మకాన్ని పెంచండి వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర…

    • APNEWS
    • September 5, 2025
    • 44 views
    బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు

    * హర్షం వ్యక్తం చేసిన మంత్రి సవిత * బీసీలపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం ఈ అవార్డు అమరావతి : బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించింది. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధతమయ్యే నిరుద్యోగ బీసీ యువతకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

    బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

    గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు.

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…

    బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…